అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు తమపై అకారణంగా దాడులు చేస్తున్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ మండిపడ్డారు. ఇస్లామిక్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల వల్ల దేశంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, పర్యావరణాన్ని పునరుద్ధరించడానికి అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. మినాబ్ పాఠశాలపై జరిగిన దాడిలో 186 మంది మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.