ఇరాన్ అణు కేంద్రాలపై ట్రంప్ వాదనలు.. ఖండించిన ఖమేనీ

అమెరికా దాడులతో ఇరాన్‌ అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఇరాన్‌ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఖండించారు. “కలలు కంటూ ఉండండి” అంటూ ట్రంప్‌ను ఎద్దేవా చేశారు. ఒక దేశం అణు పరిశ్రమ కలిగి ఉండాలా లేదా అనేది అమెరికా నిర్ణయించేది కాదని ఖమేనీ స్పష్టం చేశారు. కాగా, జూన్‌లో ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై బాంబు దాడులు ప్రారంభించగా, అమెరికా తాత్కాలికంగా వాటిలో పాల్గొన్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్