ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీంలీడర్‌గా ఎన్నికైనట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది. మొజ్తాబాను ఎన్నుకోవాలని ఆ దేశ మతపెద్దలను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన మొజ్తాబాకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో ఎంతోకాలంగా సన్నిత సంబంధాలు ఉన్నాయి. మొజ్తాబా ఎన్నికపై ఇజ్రాయెల్-అమెరికా స్పందనపై ఆసక్తి నెలకొంది.