స్థానిక పొన్నేకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో వర్చువల్ గా నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్‌లో సెయోక్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ సంస్థలో 31 మంది విద్యార్థులు వార్షికంగా రూ.6 లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డా. జె. లక్ష్మి నారాయణ తెలిపారు.
సెయోక్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హెచ్.ఆర్. మౌనిక మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి పాఠ్యపుస్తక జ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కోడింగ్ మరియు తాజా టెక్నాలజీలపై అవగాహన పెంపొందించుకోవాలి. నిరంతర అభ్యాసమే విజయం సాధించడానికి ప్రధాన ఆయుధం అని సూచించారు.
కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ శ్రీ చైతన్య యజమాన్యం విద్యార్థులపై చూపుతున్న విశేషమైన శ్రద్ధ వల్ల రికార్డు స్థాయిలో ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి అని రాబోయే రోజులలో మరిన్ని ప్రాంగణ నియామకాలు జరపడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియపరిచారు.
కళాశాల చైర్మన్ శ్రీ మల్లంపాటి శ్రీధర్ గారు మాట్లాడుతూ ప్రాంగణ నియామకలలో సెలెక్ట్ అయిన విద్యార్థులను అభినందిస్తూ,వంద శాతం నియామకాలు జరిగేలాగా చర్యలు తీసుకున్నట్లు తెలియపరిచారు.
కళాశాల డైరెక్టర్ శ్రీవిద్య గారు మాట్లాడుతూ విద్యార్థులు ప్లేస్మెంట్ అవకాశాలకు సిద్ధమవ్వడానికి మాక్ ఇంటర్వ్యూలు, టెక్నికల్ ట్రైనింగ్‌లు నిర్వహిస్తున్నాము. ఈ కృషి ఫలితంగా ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రతిష్టాత్మక సంస్థల్లో స్థానం సంపాదిస్తున్నారు” అని అన్నారు. విద్యార్థులు ఉద్యోగాలు పొందడానికి కావలసిన శిక్షణ ను ప్రథమ సంవత్సరం నుంచి ఇస్తున్నామని, అది విద్యార్థులకు ఎంతో తోడ్పాటు ఇస్తుందని ఎంపికైన విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా కళాశాల డీన్ డాక్టర్ వి సుదర్శన్, టి పి ఓ డాక్టర్ రాజేష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి, డిప్లమా ఇన్చార్జి కృష్ణ ప్రసాద్, డాక్టర్ జ్యోతి, డాక్టర్ ప్రణతి, డాక్టర్ చార్యులు, సురేష్ ఎన్నికైన విద్యార్థులకి అభినందనలు తెలిపారు.
ప్రిన్సిపాల్