అన్నపురెడ్డిపల్లి మండల మర్రిగూడెంలో ధాన్య కొనుగోలు కేంద్రంలో గురువారం విద్యుత్ ప్రమాదం జరగడంతో ఓ మహిళ కూలి మృతి చెందింది. అబ్బుగూడెం గ్రామం కెసిఆర్ కాలనీకి చెందిన మామిడాల రెమల్లి (20) మర్రిగూడెంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్ర వద్ద రోజు లాగే కూలి పనులకు వెళ్లింది. ధాన్యం ఆరబెట్టే క్రమంలో తూర్పు పాల్ పట్టే మిషన్ కు విద్యుత్ సరఫరా కావడంతో రేమల్లి విద్యుత్ ఘాతానికి గురై అక్కడే మృతి చెందింది.