అశ్వారావుపేట: పోక్సో కేసులో నిందితుడి అరెస్టు

అశ్వారావుపేట పట్టణానికి చెందిన 12 ఏళ్లలోపు గిరిజన బాలిక దసరా సెలవులకు ఊట్లపల్లిలోని అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లింది. అక్కడ అరవింద్ అనే యువకుడు బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేయడంతో ఆమె గర్భం దాల్చినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితుడైన అరవింద్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్