జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం అశ్వారావుపేటలో ఇరిగేషన్ ఏఈఈ ఎల్. శ్రీనివాస్ రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఒక రైతు తన పొలానికి మట్టి తోలుకునేందుకు అనుమతి కోరగా, శ్రీనివాస్ రూ. 2 లక్షలు డిమాండ్ చేశారని, దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ చర్యలు తీసుకున్నారు.