అశ్వారావుపేట మండలంలోని వినాయకపురంలో ఉన్న చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ మంగళవారం చోరీ ఘటన వెలుగు చూసింది. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీని గుడి వెనక భాగంలోకి తీసుకెళ్లి పగలగొట్టేందుకు యత్నించినా, సాధ్యం కాకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లారు. నగదు ఏమి పోలేదని ఆలయ ఛైర్మన్ నరాల శ్రీనివాసరావు తెలిపారు.