అశ్వారావుపేట నియోజకవర్గంలోని మల్లారం గ్రామంలో బుధవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. పద్దం మేరీ అనే మహిళ గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్త్రాలు, ఫర్నిచర్, వ్యవసాయ పనిముట్టాలు సహా విలువైన వస్తువులన్నీ తగలబడిపోయాయి. రోడ్డున పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.