అశ్వారావుపేట: చెట్టు కింద ఉన్న వ్యక్తిపై పిడుగుపడి మృతి

పొలం వద్దకు వెళ్లిన వ్యక్తిపై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన అశ్వారావుపేట మండలం శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాధనం రాజారావు(45) పొలం దగ్గరకు వెళ్తుండగా, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తుందని పక్కనే ఉన్న వేపచెట్టు కింద నిలబడ్డాడు. కొద్ది సమయానికే పెద్ద శబ్దంతో చెట్టుపై పిడుగు పడటంతో మరణించాడని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్