అశ్వారావుపేట: గంగానమ్మ ఆలయంలో చోరీ

అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి సమీపంలో ఉన్న పెదవాగు ప్రాజెక్టు వద్ద గల శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో గురువారం చోరీ జరిగింది. ఆలయం తలుపు తెరిచి లోపల ఉన్న రెండు హుండీలను ధ్వంసం చేసి సుమారు రూ. 50 వేలు అపహరించినట్లు ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై యయాతిరాజు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్