దమ్మపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా దమ్మపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ఇళ్ల మధ్య బెల్ట్‌షాపుల్లో జరుగుతున్న మద్యం విక్రయాలను అరికట్టాలని ఇన్చార్జ్ ఎంపీఓ చిరంజీవులకు వినతిపత్రం అందించారు. గత మూడు వారాలుగా ప్రజావాణిలో ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇళ్ల మధ్య, ప్రముఖ దేవాలయాల సమీపంలో మద్యం విక్రయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.