దుమ్ముగూడెం: వ్యక్తి ఆత్మహత్య

దుమ్ముగూడెం మండలంలోని సున్నం బట్టి గ్రామానికి చెందిన దున్న రాజు (50) భార్య మృతి చెందిందనే మనస్తాపంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. భార్య ఖాదరమ్మ క్యాన్సర్ తో చనిపోయింది. అప్పటి నుంచి రాజు మద్యానికి బానిసయ్యాడు. రాత్రి శివారులోని గోదావరి ఒడ్డున ఉన్న చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్