నాచారం జగదాంబ ఆలయ రహదారి సుందరీకరణకు మంత్రి ఆదేశం

నాచారం గట్టుపై కొలువుదీరిన జగదాంబ ఆలయానికి వెళ్లే రహదారిని సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం నాచారం గ్రామ పెద్దలు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు గండుగులపల్లిలో మంత్రిని కలిసి ఆలయ రహదారి అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా రహదారిని అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. రహదారి మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేసి, వాటి వెంట మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని అధికారులకు, గ్రామస్తులకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕