భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో శనివారం మంత్రులు, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు పర్యటించున్నారు. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద 6 సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరు కానున్నారు.