ఊకే శిరీష ఘటనను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శనివారం అసెంబ్లీలో ప్రస్తావించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళలకు అత్యవసర సమయంలో తక్షణ సహాయం అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఘటనపై వేగంగా విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.