భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం ప్రకాశ్‌నగర్ కాలనీలో కోతుల దాడితో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కాలనీలో సంచరిస్తున్న కోతులు అకస్మాత్తుగా వారిపై దాడి చేసి చెవులను కొరికినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన ఇద్దరిని కుటుంబ సభ్యులు దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. కాలనీలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, అధికారులు స్పందించి వాటిని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.