భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం ముద్దుల గూడెం గ్రామానికి చెందిన పంచాయతీ వర్కర్ కోట కేశవరావు (50) కడుపు నొప్పితో బాధపడుతూ, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం పురుగుల మందు తాగిన ఆయనను సత్తుపల్లి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. అతని కుమారుడు కోటా మురళి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.