అశ్వారావుపేటలో అరుదైన గుడ్లగూబ

అశ్వారావుపేటలోని బీఎస్‌ఆర్ నగర్‌లో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షమైంది. కిటికీ నుంచి వంటగదిలోకి ప్రవేశించి సన్‌షేడ్‌పై వాలింది. పక్షిని చూసి ఇంట్లోవారు ఆశ్చర్యపోయారు. ఇరుగుపొరుగువారు దానిని గుడ్లగూబగా గుర్తించి పట్టుకున్నారు. సుమారు మూడు కిలోల బరువున్న పక్షికి తెల్లటి గుండె ఆకారపు ముఖం, గోధుమ రంగు రెక్కలు ఉన్నాయి. అనంతరం స్థానికులు సమీపంలోని చెట్ల వద్ద విడిచిపెట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕