కొత్తగూడెం: ఒక్క ఫోన్‌తో ఇళ్లు సాధించుకున్నాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం కర్షల బోడు తండాకు చెందిన దివ్యాంగుడు బోడ భానుచందర్ నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతూ ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ఫోన్ చేసి తన గోడును వివరించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఎంపీడీఓ అశోక్కు కాల్ చేసి భానుచందరు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తున్న ఎమ్మెల్యే తీరును నియోజకవర్గ ప్రజలు ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్