హైదరాబాద్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను శనివారం వారి చాంబర్లో కలిసి వినతి పత్రం అందించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ఈ సందర్బంగా అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించిన పలు గిరిజన విద్యా, ఉద్యోగ మరియు సంక్షేమ సమస్యలను వినతిపత్రం రూపంలో సమర్పించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన యువతకు దక్కాల్సిన 75% శాతం జీవోను పునరుద్ధరించి సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.