ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

ఖమ్మంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) 4వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని డివిజన్ నాయకుడు మట్ట నరసింహరావు పిలుపునిచ్చారు. సోమవారం చర్లలో రైతులు, మహిళలతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మొక్కజొన్న క్వింటాకు రూ. 3 వేలు, పత్తికి రూ. 15 వేలు చెల్లించాలని కోరారు. రైతులు పెద్దఎత్తున మహాసభలకు తరలిరావాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕