ఏరియా ఆసుపత్రిలో దారుణం.. గాయంలో రాయి వదిలేశారు

భద్రాచలం పట్టణానికి చెందిన గిరిజనుడు మడకం నాగేష్(33) ప్రమాదంలో గాయపడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందాడు. గాయానికి కుట్లు వేసే సమయంలో లోపల రాయి ఉన్నా గుర్తించలేదని ఆయన ఆరోపించాడు. నొప్పి పెరగడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా రాయి ఉన్నట్లు గుర్తించారని తెలిపాడు. ఈ విషయంపై వైద్యులను ప్రశ్నించగా వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం మరోసారి చికిత్స చేస్తామని వైద్యులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్