భద్రాచలం: 12 మంది మావోయిస్టులు లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో బుధవారం 12 మంది మావోస్టులు పోలీసులకు లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు పార్టీ వెస్ట్ బస్తర్ కమిటీ సభ్యులు, మెడికల్ టీం, ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారని దంతెవాడ ఎస్పీ గౌరవ్ తెలిపారు. 2020 నుంచి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ‘లాల్ వర్రాట్’ చేపట్టిందని, గత ఐదేళ్లలో దంతెవాడ జిల్లాలోనే 1005 మంది మావోస్టులు లొంగిపోయారని తెలిపారు. ఇతర మావోస్టులు కూడా లొంగిపోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్