భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధి ఏఎస్ఆర్ కాలనీలో ఈనెల 7న జరిగిన కణితి సతీశ్ హత్య కేసులో పరారీలో ఉన్న 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు గుంజ సాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో మొహినుద్దీన్ నజీర్, కామేశ్, సాంబ, దుర్గా ప్రసాద్, గోపిచంద్, గణేశ్, మధు, అజయ్, సాయి ఉన్నారని వెల్లడించారు.