భద్రాచలంలో సంచలనం సృష్టించిన కణితి సతీష్ హత్య కేసులో నిందితుడు గుంజ సాయిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ బుధవారం తెలిపారు. ఈనెల 7న భద్రాచలం ఏఎస్ఆర్ కాలనీకి చెందిన కణితి సతీష్ అనే ఆటో డ్రైవర్ ను పాత కక్షలతో గుంజ సాయి మరికొందరితో కలిసి దారుణంగా హతమార్చాడు. దీనిపై సతీష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, మూడు బృందాలుగా ఏర్పడి గాలించామని, నిందితుడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.