భద్రాచలం: మేడారం వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం

బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి మేడారానికి భక్తులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. తాడ్వాయి దాటిన 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రమాదకర మలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్