ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనాస్థలం నుండి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.