భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం 36.6 అడుగులు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి వరద ప్రవాహం పెరుగుతుందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు నదిలోకి దిగకుండా చర్యలు చేపడుతున్నారు. కాగా, 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.