భద్రాచలం పట్టణంలోని ఓ లాడ్జి నిర్వాహకుల బ్లాక్ మెయిల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లాడ్జికి వచ్చిన జంటలను ఏకాంతంలో ఉన్న సమయంలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే రూ.లక్ష ఇవ్వాలని బెదిరించారు. ఈ బ్లాక్ మెయిల్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.