చర్ల: ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి

చర్ల మండలంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం సందర్శించారు. గిరిజన రోగులను పరామర్శించి, వారికి అందుతున్న చికిత్స, మందుల సరఫరా గురించి ఆరా తీశారు. 'మీకు తోడుగా ప్రభుత్వం ఉంది, ఆందోళన చెందకండి' అని గిరిజన బాధితులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్