చర్ల: ఎన్ కౌంటర్ లో ముగ్గురు మృతి

ఎన్ కౌంటర్ లో ముగ్గురు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. చర్ల సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి ప్రాంతంలోని అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు బీజాపూర్ ఎస్పీ తెలిపారు. వారి మృతదేహాల్ని జిల్లా హెడ్ క్వార్టర్లకు తరలించినట్లు తెలిపారు. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్