చర్ల మండలం సుబ్బంపేట పంచాయతీ రామయ్య నగర్ సమీపంలో శుక్రవారం ఇసుక లారీ ఢీకొని వన్యప్రాణి నక్క మృతి చెందింది. ఇసుక లారీ ఢీకొనడం వల్ల నక్క యొక్క శరీర భాగాలు చిందరవందరగా అయిపోయాయి. సుబ్బంపేట పంచాయతీలో విచ్చలవిడిగా ఇసుక ర్యాంపులు ఉండడం వల్ల రోజుకు కొన్ని వందల లారీలు రైరై అంటూ పరుగులు తీస్తున్నాయని స్థానికులు తెలిపారు. అటవీ ప్రాంతం నుంచి వస్తున్న మూగజీవులు రోడ్డు ప్రమాదంలో బలవుతున్నాయని చెప్పారు.