భద్రాచలం ఆలయ పనులపై కలెక్టర్ ఆరా

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనులను కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ కలిసి శనివారం పరిశీలించారు. ఉత్తర ద్వారం, చిత్రకూట మండపం, గోశాల, అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్, మాడ వీధుల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕