దుమ్ముగూడెం: పోడు సాగుదారులపై కేసు నమోదు

దుమ్ముగూడెం మండలం గడ్డోరుగట్ట వివాదాస్పద 17 హెక్టార్ల పోడు భూములకు కందకాలు తీసే క్రమంలో అటవీశాఖ, పోడుసాగుదారుల మధ్య వివాదం చోటుచేసుకోగా, ఇద్దరు పోడుసాగుదారులపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. వివాదస్పద అటవీ భూములకు రక్షణగా అటవీశాఖ ఎక్స్కవేటర్ తో కందకం తీసే పనులను చేపట్టింది. పనులు జరగకుండా కొందరు పోడుసాగుదారులు యంత్రానికి అడ్డుపడ్డారు. పనులను అడ్డుకోవడం చట్టవ్యతిరేకమని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్