ఈదురుగాలులకు రేకుల ఇల్లు కూలిపోయిన ఘటన దుమ్ముగూడెం మండలం ప్రగళ్లపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం మండలంలో ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ప్రగళ్లపల్లి గ్రామ పంచాయతీలోని శ్రీనగర్ కాలనీలో రేకుల ఇల్లు పూర్తిగా ద్వంసమైంది. ఒకరు గాయపడ్డారు.