ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ఆదివాసీ హక్కుల ఉద్యమ నాయకుడు చందా లింగయ్యకు సామాజిక సేవ, నాయకత్వ రంగాల్లో విశిష్ట సేవలకు గాను United American University for Leadership and Excellence గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ పురస్కారం భద్రాచలంలో అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, అనుచరులు, పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.