భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించి, సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేష్ మాట్లాడుతూ, వైద్యుల కొరతతో ఏజెన్సీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.