కరకగూడెం మండలంలోని అశ్వాపురం వలస ఆదివాసి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కోవాసి లక్ష్మణ్ అనే గిరిజనుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సీపీఎం మండల కమిటీ సభ్యుడిగా చురుకైన పాత్ర పోషిస్తున్న లక్ష్మణ్‌పై జరిగిన ఈ దాడి స్థానికంగా కలకలం రేపింది. హత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.