ఖమ్మం నగరంలో దారుణ హత్య

ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డలో గురువారం మోటే రాములమ్మ అనే మహిళను ఆమె మరిది కొడుకు శేఖర్ కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డుకోబోయిన బండ శేఖర్ పై కూడా దాడి చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు శేఖర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్