ఉత్తమ డాక్టర్‌గా డా. కావ్యా రావు జలగం ఎంపిక

WGL నగరంలో 2017 సంవత్సరం నుంచి ఫెర్టిలిటీ నిపుణురాలిగా సేవలందిస్తున్న డా. కావ్యా రావు జలగం ఉత్తమ వైద్యురాలిగా ఎంపికయ్యారు. రిప్రొడక్టివ్ మెడిసిన్, ఐవీఎఫ్ రంగాల్లో విశేష సేవలు అందిస్తూ వైద్య రంగంలో తనదైన ముద్ర వేసినందుకు ఈ గుర్తింపు లభించింది.

జూలై 1న నిర్వహించనున్న డాక్టర్స్ డే వేడుకల సందర్భంగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డా. కావ్యా రావు జలగంకు ఉత్తమ డాక్టర్ అవార్డు ప్రదానం చేయనున్నారు.ఈ సందర్భంగా డా. కావ్యా రావు జలగంకు వైద్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్