మంగళవారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన విద్యార్థి ఎన్నికల కోసం 4 పోలింగ్ బూతులను, 8 ఈ.వి.ఎం లను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిజమైన లోక్ సభ, శాసనసభ ఎన్నికలను తలపించే విధంగా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని వారు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవి మారుత్ గారు, ప్రిన్సిపల్ ఆర్. పార్వతి రెడ్డి గారు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ ఎన్నికలలో ఆరు నుండి పదవ తరగతి విద్యార్ధిని విద్యార్థులు ఓటింగ్లో పాల్గొంటారని ఎస్.పి.ఎల్ మరియు ఏ.ఎస్.పి.ఎల్ అభ్యర్థులకు తమ ఓటింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. పదవ తరగతి నుండి ఎస్.పి.ఎల్ కి 8 మంది, విద్యార్థినీ, విద్యార్థులు, తొమ్మిదో తరగతి నుండి ఎ.ఎస్.పి.ఎల్ కి 16 మంది విద్యార్థినీ, విద్యార్థులు పోటీలో ఉన్నారు. వీరిలో సీనియర్ బాలికల ప్రతినిధిగా తమన్వి పల్లా, సీనియర్ బాలుర ప్రతినిధిగా గా గుర్రం అర్జున్ ఎంపికవగా, జూనియర్ బాలికల ప్రతినిధిగా గా ఎన్.అక్షర, జూనియర్ బాలుర ప్రతినిధిగా ఇటికల అనీల్ కుమార్ ఎంపికయ్యారు. మిగిలిన అభ్యర్థులకు పోలైన ఓటింగ్ శాతాన్నిబట్టి ప్రిఫెక్టోరియల్ కమిటీకి ఎంపిక చేస్తారన్నారు. మొత్తం 94 శాతం ఓట్లు పోలయినట్లు తెలియజేశారు.
ఈ ఎన్నికలలో విజేతలయిన వారిని హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి. రవి మారుత్ గారు, ప్రిన్సిపల్ ఆర్. పార్వతి రెడ్డి గారు అభినందిస్తూ, పారదర్శకంగా ఓటింగ్ నిర్వహించి భావి పౌరులైన నేటి విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం పాఠశాలలో అమలుచేశామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఎలక్షన్ కమీషనర్గా సీనియర్ ఉపాధ్యాయులు సోషల్ డిపార్ట్ మెంట్ హెడ్ వి.ఎస్.ఎన్.మూర్తి గారు వ్యవహరించారు. అలాగే ఎలక్షన్ మెంబర్లుగా సోషల్ డిపార్ట్ మెంట్ టీచర్స్ రాజరాజేశ్వరి, వేణుగోపాల్, రామారావు, షమీర్, వెంకటేశ్వర్లు, దాసు, నిర్మల, అల్విన్ జిమ్మి మరియు సుజాత గార్లు వ్యవహరించారు. పోలింగ్ సిబ్బందిగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీరికి తోడ్పాటును అందిస్తూ విద్యార్థులను సక్రమమైన మార్గంలో ఎన్నికల నిర్వహణకు ఎన్.సి.సి క్యాడెట్స్ కృషి అభినందనీయం అని హార్వెస్ట్ యాజమాన్యం తెలియజేశారు.