ఖమ్మం నగరంలోని దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కళాశాలలో గురుపౌర్ణమి వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దరిపల్లి విద్యాసంస్థల అధినేత, ప్రిన్సిపాల్ డాక్టర్ దరిపల్లి కిరణ్‌ను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గురువుల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. గురువు కేవలం దిశా నిర్దేశకుడు మాత్రమే కాకుండా విద్యార్థి జీవితాన్ని మార్చే మార్గదర్శకుడని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దరిపల్లి కిరణ్ మాట్లాడుతూ "గురువు అంటే కేవలం విద్య బోధించేవాడు కాదు. జీవితంలో విలువలు, క్రమశిక్షణ, నైతికతలను బోధించే ప్రేరణాత్మక శక్తి కూడా. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడంలో గురువు పాత్ర అత్యంత కీలకం," అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.