ఘనంగా హార్వెస్ట్ క్లాస్ సాథీ అవార్డు ప్రధానోత్సవం

హార్వెస్ట్ విద్యాసంస్థ తన 25 సంవత్సరాల అద్భుతమైన ప్రస్థానాన్ని గర్వంగా జరుపుకుంటున్న రజతోత్సవ వేడుకలలో భాగంగా నేడు (సెప్టెంబర్ 19 శనివారం 2026 న) క్లాస్ సాథీ ఛాంపియన్షిప్ 2026 యొక్క బృహత్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి దక్షిణ కొరియా నుండి క్లాన్ సాథీ సి.ఈ.ఓ. పంకజ్ అగర్వాల్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామనహాయం రఘురాం రెడ్డి గారు, క్వెన్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డా॥ కె. నాగమణి హార్వెన్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్టాండెంట్ షిరవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతిరెడ్డి గార్లు ముఖ్యఅతిధులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా దక్షిణ కొరియా నుండి వచ్చిన క్లాస్ సాథీ సి.ఈ.ఓ. పంకజ్ అగర్వాల్ గారు మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో విద్యార్ధినీ విద్యార్థులు నూతన విద్యారంగ వ్యవస్థలో మేథస్సును అభివృద్ధి చేసుకునే అవసరం ఉందని, తదనుగుణంగా తమచే రూపుదిద్దబడిన క్లాస్ సాథీ యాప్ ద్వారా పిల్లలలో పాఠ్యాంశాలకు సంబంధించిన క్విజ్ను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా పాఠశాలలకు అందుబాటులో ఉంచామన్నారు. హార్వెస్ట్ విద్యాసంస్థల వారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలల కంటే క్లాస్ సాథీ యాప్ను నమర్ధవంతంగా ఉపయోగించుకొని 24,718 పాయింట్లు సాధించి దేశంలో మొదటి స్థానాన్ని కైవనం చేసుకోవడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. భవిష్యత్లో మరింత ఉన్నతంగా యాప్ను ఉపయోగించుకొని విద్యార్థులు రాణించాలని కోరారు.
అనంతరం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామనహాయం రఘురాంరెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని, మెట్రోపాలిటన్ నగరాలలో లభించే విద్యను ఖమ్మం పట్టణానికి చేరువయ్యేలా చేసిన హార్వెన్ విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. అతితక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను ఖమ్మం జిల్లా విద్యార్ధినీ విద్యార్థులకు అందించడం సంతోషకరమన్నారు. భవిష్యత్లో మరింత ఉ న్నతమైనటువంటి భావితరాల్ని దేశానికి అందించాలని వారు కోరారు.
పాఠశాల కరస్పాండెంట్ పి. రవి మారుత్ గారు మాట్లాడుతూ, హార్వెన్ట్ పాఠశాల 25 నం॥ గా బాల్యాన్ని ఆనందంగా, బోధనను వత్తిడిలేకుండా పిల్లలకు అందించటంలో తనదైన ముద్రను వేసిందన్నారు. ఇది కేవలం నుదీర్ఘకాలానికి సంబంధించినది కాదనీ 25 వనంతాల పరిమళభరిత ప్రయాణమనీ అన్నారు. 25 నం|| గతం గర్వంగానూ, మరింత బాధ్యతను గుర్తుచేస్తుందన్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఆర్. పార్వతి రెడ్డి మాట్లాడుతూ, సిల్వర్ జూబ్లీ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామనీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లలో కూడా ఇటువంటి వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత 25 నం|| హార్వెన్ట్ పురోభివృద్ధిలో భాగస్వాములైన ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రులను అభినందించారు.
అనంతరం తమ విద్యార్ధినీ విద్యార్థులు నిర్వహించిన మ్యూజికల్ బ్యాండ్, నృత్యప్రదర్శనలు సాయంత్రం అతిధులను ఆహ్లాదింపజేసింది. విచ్చేసిన ముఖ్యఅతిధులు, యాజమాన్యం చేతుల మీదుగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్ధినీ విద్యార్థులు అవార్డులను, ప్రశంసాపత్రాలను స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థలైన టెండర్రూట్స్ స్త్రింగ్ఫ్, సెడార్వ్యాలీ పిన్సిపల్స్, అకడమిక్ ఇంచార్జ్లు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕