రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిజీ షెడ్యూల్ వలన రాలేని కారణంగా తమ సందేశాన్ని ఈ విధంగా తెలియజేశారు. "తరగతి గది విద్యార్థి జీవితంలో మొదటి ప్రయోగశాల. ఇక్కడే అతను ప్రశ్నించడం నేర్చుకుంటాడు. తప్పులు చేయడం నేర్చుకుంటాడు, వాటినుంచి మళ్లీ నిలబడటం నేర్చుకుంటాడు. అదే విద్యార్థి సమాజంలోకి అడుగుపెట్టినప్పుడు తరగతి గదిలో నేర్చుకున్న విలువలు ఆచరణలో కనిపిస్తాయి. అప్పుడే విద్య వ్యక్తిగత విజయాన్ని మించి సామాజిక మార్చుకు కారణమవుతుంది. నాయకత్వ లక్షణాలను అలవరచుకోవడం పాఠశాల స్థాయినుండే బీజాలు పడాలన్నారు".
అనంతరం ఏదులాపురం చైర్పర్సన్ పోకబత్తిని అనిత మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు విద్యార్థులు వెళ్ళకుండా తమ గ్రామీణ ప్రాంతానికి చేరువలోనే విద్యార్థులకు పూర్తిస్థాయి క్రీడా వసతులతో పాటు, సి.బి.ఎన్.ఇ. విద్యసు అందించడం ఎంతో అభినందనీయమని, ఇందుకు హార్వెస్ట్ స్ప్రింగ్లోఫ్ యాజమాన్యం అభినందనీయమని అన్నారు. ముఖ్య అతిధులుగా విచ్చేసిన వక్తలు తమ సందేశాలను తెలియజేస్తూ "నేటి విద్య ఇక తరగతి గదులకు లేదా సరిహద్దులకు పరిమితం కాదు, ఇది ఒక ప్రపంచ ఉమ్మడి బాధ్యత అని, విద్య అభ్యాసకులను మాత్రమే కాకుండా వేగంగా మారుతున్న ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలు, విలువలు మరియు అనుకూలతలతో శక్తివంతం చేయడం అవసరమని, విద్యావ్యవస్థలు దేశాలలో సహకరించినప్పుడు సాంస్కృతిక అవగాహన, విద్యాపరమైన నైపుణ్యం మరియు స్థిరమైన అభివృద్ధికి మార్గాలను సృష్టిస్తాయి అని, విద్య జీవితానికి తయారీ కాదు- అది జీవితమే అన్నారు.
"హార్వెస్ట్" విద్యాసంస్థల కరస్పాండెంట్ రవిమారుత్ మాట్లాడుతూ నేటి ప్రపంచంలో విద్యార్థి కేంద్రీకృత మరియు దార్శనిక విద్య చాలా అవసరం. ఎందుకంటే ప్రతి విద్యార్థి ఒకేలా ఉండదు. ఒకరికి సంగీతం అంటే ఇష్టం, ఇంకొకరికి గణితం, మరొకరికి క్రీడలు, ఇంకొకరికి సేవాభావం. ఈ ప్రతిభలను గుర్తించి వాటిని వికసింపజేయడమే విద్య యొక్క దార్శనిక లక్ష్యం. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తులు కాదు. వారు విద్యార్థి జీవితంలో మార్గదర్శక దీపస్తంభాలు, విద్యార్థి కృంగిపోయినప్పుడు ధైర్యం చెప్పేవారు, విజయాన్ని పొందినప్పుడు వినయం నేర్పేవారు. తల్లిదండ్రులు పిల్లల తొలి గురువులు. వారి మాటలు, వారి ప్రవర్తన పిల్లల జీవితంపై చెరగని ముద్ర వేస్తాయి. పాఠశాల ఇంటి మధ్య సమన్వయం ఉంటే విద్య సంపూర్ణమవుతుంది. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యఅందించడమే "హార్సెన్ట్" విద్యాసంస్థల ముఖ్య లక్ష్యం అని అన్నారు. అందుకు తోడ్పాటును అందిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలను తెలియజేశారు.
డైరెక్టర్ పార్వతీ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలో విద్యార్థినీ, విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలే కాకుండా వివిధ రకాల క్రీడాంశాలు, చైతిక విలువలు, క్రమశిక్షణ మరియు వ్యక్తిత్వ వికాసం పెంపొందేలా విద్యనందిస్తున్నామని, విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి కేవలం చదువు మాత్రమే సరిపోదని, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని విద్యా రంగంలో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విజ్ఞాన ప్రదర్శనలు, ఒలింపియాడ్స్, నాయకత్వ కార్యక్రమాలలో మన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాఠశాల గౌరవాన్ని పెంచారు. మన విద్య దృష్టికోణం కేవలం తరగతి గదులకే పరిమితం కాదు. ప్రాజెక్ట్ ఆధారిత విద్య, విలువాధారిత బోధన, పర్యావరణ మరియు సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నృజనాత్మకత, విమర్శాత్మక ఆలోచన, బాధ్యతాయుత పౌరస్ఫూర్తిని పెంపొందిస్తున్నాం. ఈ విజయాల వెనుక మన యాజమాన్యానికి దూరదృష్టి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల విశ్వాసం బలమైన పునాదులుగా నిలిచాయి. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ విద్యాసంవత్సరం సాధించిన పురోగతి ప్రిన్సిపల్. రవిశంకర్ విద్యార్థినీ, విద్యార్థులు అందుకున్న అవార్డులతో పాటు, ఈ విద్యాసంవత్సరం వార్షిక రిపోర్ట్ను గారు ఈ సందర్భంగా వివరించారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా జరిగిన వార్షికోత్సవ వేడుకలో చిన్నారుల నృత్యాలు, యోగా, కరాటే, పిరమిడ్, కర్రసాము విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, హార్వెస్ట్ విద్యాసంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్ప్రింగ్ఫ్ ప్రిన్సిపల్ బి.రవిశంకర్, (ప్రైమరీ హెచ్, ఎం. మల్లెం ప్రీతి, ఫ్రీ ప్రైమరీ ఇంచార్జ్ వి. చందన, జె. యాకయ్య. అడ్మిన్ వి.సరస్వతి మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.