జర్నలిస్టు రవీందర్ రావుకు టీడబ్ల్యూజేఎఫ్ నేతల పరామర్శ

అనారోగ్యంతో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్న టీడబ్ల్యూజేఎఫ్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేన్నేని రవీందర్ రావును ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ పరామర్శించారు. బుధవారం జగిత్యాలలోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న రవీందర్ రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఇమ్రాన్, ఉపాధ్యక్షులు కాసం శ్రీనివాస్ రెడ్డి, రాగం రమేష్, సహాయ కార్యదర్శి అనంతుల కాంతారావు, కోశాధికారి మేన్నేని శ్రీనివాస రావు, కార్యవర్గ సభ్యుడు గోపాటి నరేందర్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕