ఖమ్మం: సర్కారీ ఆఫీసుల్లో ప్రైవేట్ డ్రైవర్ల ‘దందా’!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో ప్రైవేట్ డ్రైవర్లు చక్రం తిప్పుతున్నారు. పోలీస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వంటి కీలక శాఖల్లో అధికారుల అండతో వీరు వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ వద్ద ప్రైవేట్ డ్రైవర్‌గా ఉంటూ డిజిటల్ లంచాలు తీసుకుంటున్న వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరిన్ని శాఖల్లోని అవినీతిపై కూడా విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్