ఖమ్మం: పొదుపు సొమ్ము గోల్‌మాల్.. నలుగురు ఆర్పీల తొలగింపు

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో స్త్రీనిధి రుణాల సొమ్మును స్వాహా చేసిన నలుగురు మెప్మా ఆర్పీలను విధుల నుంచి తొలగించారు. మహిళా సంఘాల సభ్యులు చెల్లించిన నగదును బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్లు తేలడంతో పీడీ నళిని పద్మావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, నిధుల వినియోగంలో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్