ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఓబులరావు బంజర గ్రామానికి చెందిన కేలోతు శ్రీను దంపతులకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. బాబు పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించగా, పాపలో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. వైద్యుల ప్రకారం, పాపకు బోన్ మారో సర్జరీ అవసరమని, దీనికి భారీగా ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే, రోజువారీ కూలీ చేసుకునే ఈ నిరుపేద కుటుంబానికి అంత డబ్బు సమకూర్చడం అసాధ్యంగా మారింది. తమ పిల్లల వైద్యానికి దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వేడుకుంటున్నారు.