ఖమ్మం డిన్నర్ లో 90ల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న డీజీపీ!

ఖమ్మం పర్యటనలో ఉన్న రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, సీపీ సునీల్ దత్ ఇచ్చిన డిన్నర్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు 1990లలో జిల్లా స్థాయిలో పనిచేసిన మధుర జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఆ రోజుల్లో అధికారులు తరచూ కలవడం వల్ల స్నేహబంధం, సమన్వయం బలోపేతం అయ్యేవని డీజీపీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ డిన్నర్లో యువ మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, ఏఎస్పీలతో ఆయన ముచ్చటించారు.

సంబంధిత పోస్ట్